English   

సందడి లేకుండా కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు ఎంగేజ్‌మెంట్ ఫోటో వైరల్.. 

 Kajal Aggarwal engagement
2020-10-14 09:14:07

కాజల్‌ అగర్వాల్‌ త్వరలోనే పెళ్లికూతురు కాబోతుంది. ఈమె పెళ్లి కన్ఫర్మ్ అయి కూడా కొన్ని రోజులవుతుంది. ఇప్పుడు ఈమె నిశ్చితార్థం కూడా సందడి లేకుండా జరిగిపోయింది. చాలా ఏళ్లుగా తెలిసిన అబ్బాయి.. చిన్నప్పటి నుంచి తనతో కలిసి చదువుకున్న కుర్రాడు గౌతమ్ కిచ్లుతో మూడు ముళ్లు.. ఏడడుగులు నడవబోతుంది కాజల్. ఎన్నో ఏళ్ల తమ ప్రేమకు పెళ్లితో శుభం పలుకుతున్నారు కాజల్, గౌతమ్. అక్టోబర్ 30న ఈ ఇద్దరి పెళ్లి జరగనుంది. దాని కంటే ముందు చాలా సైలెంట్‌గా నిశ్చితార్థం జరిగింది. బిజినెస్‌ మ్యాన్‌గా గౌతమ్ కిచ్లుకు ముంబైలో మంచి పేరుంది. గౌతమ్‌తో పెళ్లిని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ ఇద్దరూ దిగిన ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. అందులోనే నిశ్చితార్థం ఫోటో కూడా ఉంది. ఈ ఎంగేజ్‌మెంట్ ఫోటోలో ఇద్దరూ సంప్రదాయంగా కనిపిస్తున్నారు. 

కాజల్ ఒక అందమైన లెహంగాకు తోడు మ్యాచింగ్ నెక్లెస్ వేసుకుంది. ఇక గౌతమ్ కిచ్లు సింపుల్ కుర్తాలో కనిపించాడు. దీనిపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టింది కాజల్. లవ్ సింబల్‌ని పెట్టిన కాజల్‌.. మరో పోస్ట్‌లో ఇందులో కూడా నీ డిజైనింగ్ తెలుస్తుంది అంటూ కామెంట్ చేసింది. తనకు కాబోయే వాడు డిజైనర్ కాబట్టి అలా పోస్ట్ చేసింది కాజల్. ఇద్దరికీ ఓ స్టార్ హోటల్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్ ప్లాన్ చేసారు కుటుంబ సభ్యులు. కానీ ప్రస్తుతం ముంబైలో ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత అలాంటి ప్లాన్స్ అన్నీ వర్కవుట్ కావని తెలుసుకున్నారు. అందుకే కాజల్‌ ఇంట్లోనే ఈ ఇద్దరి పెళ్లి వేడుక జరపనున్నారు ఫ్యామిలీ మెంబర్స్. ఈ పెళ్లికి కేవలం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారని.. మీడియాకు అనుమతి లేదని తెలుస్తుంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా తక్కువ మందికి మాత్రమే ఆహ్వానం పలుకుతున్నారు. 

More Related Stories