English   

తిరుమల శ్రీవారిని మరోసారి దర్శించుకున్న దిల్ రాజు దంపతులు.. 

Dil Raju
2020-10-14 09:20:26

పెళ్లి తర్వాత చాలా మారిపోయాడు దిల్ రాజు. లాక్ డౌన్ సమయం కావడంతో కుటుంబ సభ్యులతోనే గడిపేస్తున్నాడు. ముఖ్యంగా మే లో రెండో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతోనే ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నాడు. ఇప్పుడు కూడా మరోసారి ఈయన తిరుమల దర్శనం చేసుకున్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. భార్యతో కలిసి హాయిగా ఆటలు ఆడుకుంటూ.. డైట్ చేస్తూ.. ఫిజిక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దిల్ రాజు. అంతేకాదు భార్యతో కలిసి ఈయన చేసిన ఓ ఫోటోషూట్ కూడా వైరల్ అయింది. ఇప్పుడు ఈ దంపతులు మరోసారి తిరుమల వచ్చారు. వీఐపీ కేటగిరీలో ఈ జంట వెంకన్న సామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు దిల్ రాజు దంపతులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశ్వీరచనాలు అందించారు. మే నెలలో పెళ్లి చేసుకున్న తర్వాత అప్పట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించారు. ఇప్పుడు మరోసారి వచ్చారు. దర్శనం తర్వాత దిల్ రాజు దంపతులు కెమెరా కంట పడ్డారు. అయితే మీడియాతో మాట్లాడటానికి మాత్రం నిర్మాత దిల్ రాజు ఆసక్తి చూపించలేదు. 

మూడేళ్ళ కింద దిల్ రాజు మొదటి భార్య అనిత అనారోగ్యంతో కన్నుమూసారు. అప్పట్నుంచి ఒక్కడే ఉంటున్నాడు ఈయన. కూతురు కూడా అమెరికాలో ఉండటంతో ఈ వయసులో దిల్ రాజు ఒక్కడే ఉండటం యిష్టం లేక తండ్రికి రెండో పెళ్లి చేసింది కూతురు. ఆమె స్వయంగా ఈ సంబంధం చూసి పెట్టారని ఆయన సన్నిహితులే చెప్తుంటారు. చాలా తక్కువ మందిని పిలిచి ఈ పెళ్లి చేసుకున్నాడు దిల్ రాజు. లాక్ డౌన్ సమయంలో మొదట పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీ రాజు కావడం విశేషం. 

తన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. సినిమా విడుదలకు ఉన్నా కూడా వెంకన్న సన్నిధానానికి వచ్చి వెళ్తుంటాడు దిల్ రాజు. సినిమా అయితే చిత్రయూనిట్‌తో పాటు వస్తుంటాడు.. వ్యక్తిగతం అయితే కుటుంబంతో పాటు వస్తుంటాడు. 2020 లాక్‌డౌన్‌లో కావాల్సినంత టైమ్ దొరికింది. అందుకే భార్యతో సమయాన్ని గడుపుతున్నాడు దిల్ రాజు. ప్రస్తుతం ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్‌తో పాటు మరో మూడు నాలుగు సినిమాలను కూడా లైన్‌లో పెట్టాడు. అందులోనే హిందీ జెర్సీ రీమేక్ కూడా ఉంది. అల్లు అరవింద్‌తో కలిసి ఈ సినిమాను అక్కడ నిర్మిస్తున్నాడు దిల్ రాజు. నాని పోషించిన పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి హిందీలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 

More Related Stories