English   

మోనాల్ పగలు అఖిల్ తో..రాత్రి అభితో..సుజాత సంచలన వ్యాఖ్యలు

 Sujatha
2020-10-14 09:24:34

బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తున్న కంటెస్టెంట్స్ అందరూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. తాజాగా హౌస్ నుండి ఎలిమినేట్ అయి భయటకు వచ్చిన సుజాత కూడా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇంటర్వ్యూలో సుజాత మాట్లాడుతూ..అఖిల్, అభిజిత్, మోనాల్ మధ్య ఉన్న రిలేషన్ పై సంచలన విషయాలు బయటపెట్టింది. మోనాల్ చాలా క్లారిటీగా గేమ్ ఆడుతుంది కానీ అభి, అఖిల్ కి క్లారిటీ లేదు. మోనాల్ ఇద్దరి ఫీలింగ్స్ తో ఆడుకుంటుంది. అదే సమయంలో ఆ ఇద్దరూ కూడా మోనాల్ ఫీలింగ్స్ తో అడ్డుకుంటున్నారు. మోనాల్ కొద్దిసేపు అఖిల్ తో బాగుంటుంది.. మరికొద్దిసేపు అభి తో బాగుంటుంది. ఉదయం మొత్తం అఖిల్ పక్కనే ఉంటుంది. అఖిల్ రాత్రి త్వరగా నిద్రపోతాడు దాంతో సోఫాలో కూర్చుని అభిజిత్ తో ముచ్చట పెడుతూ కూర్చుంటుంది. ఆ ముగ్గురి మధ్య ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడంలేదు. వాళ్ళ రిలేషన్ ఇంట్లో వాళ్ళని కూడా తికమక పెడుతోంది. యాంకర్ వారిది ట్రయాంగిల్ లవ్ స్టొరీ నా అని అడుగగా. సుజాత మాట్లాడుతూ..అది వెరైటీ లవ్ స్టొరీ అని ట్రయాంగిల్ కాదని వి యాంగిల్ స్టోరీ అని తెలిపింది. అఖిల్, అభి ఇద్దరూ ఆమె వద్దకు వస్తారని పేర్కొంది. అంతే కాకుండా అఖిల్ కు అభిజిత్ కి మధ్య వ్యక్తిగత విబేధాలేమి లేవని కేవలం మనస్పర్థలు మాత్రమే ఉన్నాయని సుజాత చెప్పుకొచ్చింది.

More Related Stories