English   

బాత్రూమ్ లో జారిపడ్డ రాగిణి..బెయిల్ కోరుతూ పిటిషన్

 Ragini Dwivedi
2020-10-14 09:32:18

కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం రేపడంతో అధికారులు దర్యాప్తు నిర్వహించారు. ఈ కేసులో ఇద్దరు హీరోయిన్లు సంజనా గల్రాని, రాగిణి ద్వివేది లకు సంబంధాలు ఉన్నాయని గుర్తించడంతో పోలీసులు అరెస్ట్ చేసి పరప్పన సెంట్రల్ జైలుకు పంపించారు. రాగిణి ,సంజనా డ్రగ్స్ వినియోగించడంతో పాటు పరిశ్రమకు చెందిన ప్రముఖులకు సైతం డ్రగ్స్ విక్రయించినట్టు తేలింది. అంతే కాకుండా ఓ యాప్ ద్వారా సెక్స్ రాకెట్ నడిపినట్టు కూడా నిర్ధారణ అయ్యింది. ఇక అరెస్ట్ అయిన హీరోయిన్లు పలుమార్లు కోర్టులో బెయిల్ కోసం అభ్యర్థించినప్పటికి వారి అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. కాగా తాజాగా నటి రాగిణి ద్వివేది జైలులోని బాత్రూమ్ లో కాలు జారి కింద పడినట్టు తెలుస్తోంది. దాంతో రాగిణి తనకు బెయిల్ కావాలని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేసుకోవడానికి అనుమతించాలని కోర్టును అభ్యర్థించింది. కింద పడటంతో తనకు వెన్ను నొప్పితో పాటు, నడుముకు దెబ్బ తగిలిందని పేర్కొంది. జైలులో తనకు చికిత్స చేసినప్పటికీ ఉపశమనం కలగటం లేదని అభ్యర్థనలో పేర్కొంది. రాగిణి ఆర్జిని పరిశీలించిన కోర్టు దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు క్రైం బ్రాంచ్ పోలీసులకు  అవకాశం కల్పిస్తూ విచారణను వాయిదా వేసింది. ఇక ఈ కేసులో కన్నడ పరిశ్రమలో ఇంకెవరికైనా డ్రగ్స్ తో లింకులు ఉన్నాయా అని గుర్తించేందుకు అధికారులు విచారణ వేగవంతం చేసారు.

More Related Stories