English   

రమేష్ బాబు బర్త్ డే..మహేష్ ఎమోషనల్ ట్వీట్

Mahesh Babu
2020-10-14 09:36:32

సూపర్ స్టార్ కృష్ణ కుమారులు మహేష్ బాబు, రమేష్ బాబు ఇద్దరూ సినిమాల్లో హీరోలుగా నటించారు. అయితే రమేష్ బాబు కొన్ని సినిమాల్లో హీరోగా నటించి ఆ తరవాత నటనకు గుడ్ బై చెప్పారు. అనంతరం ఆయన ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి సినిమాలను నిర్మించారు. అయితే నిర్మాత కూడా రమేష్ బాబు సక్సెస్ అవ్వలేకపోయారు. దాంతో ఆయన సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఇక కొన్నేళ్లుగా ఆయన గురించి మీడియాలో కథనాలు కూడా రావడంలేదు. ఇదిలా ఉండగా ఈరోజు రమేష్ బాబు తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా అతడి సోదరుడు ప్రిన్స్ మహేష్ బాబు బావోద్వేగంతో అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. " నా అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా అన్నయ్య నుండి ఎంతో నేర్చుకున్నాను. క్రమశిక్షణ, అంకితభావం, అభిరుచి లాంటి గుణాలను అన్నయ్య నుండే నేర్చుకున్నాను. మా అన్నయ్య ఎప్పుడూ ఆయురారోగ్యాలతో , సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ మహేష్ బాబు ట్వీట్ లో పేర్కొన్నారు. మరోవైపు సోదరి మంజుల కూడా రమేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

More Related Stories