English   

నవీన్ తో కొరటాల వెబ్ సిరీస్

Koratala Siva
2020-10-14 09:41:34

దేశంలో కరోనా లాక్ డౌన్ కారణంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పుల్లో భాగంగానే థియేటర్లు మూతపడి ఓటిటీ కి క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటీనటులు సైతం ఓటీటీ లో తమ జాతకాన్ని పరీక్షించుకున్నారు. అంతే కాకుండా నిర్మాతలు కూడా వెబ్ సిరీస్ లు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ ఓటీటీ లో ప్రొడ్యూసర్ గా ఓ వెబ్ సిరీస్ తీస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న కొరటాల ఇప్పటికే వెబ్ సీరీస్ కోసం స్టోరీని సిద్ధం చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వెబ్ సీరీస్ కు కొరటాల డైరెక్షన్ టీం లోని ఓ వ్యక్తి దర్శకత్వం వహించనున్నారట. ఇక ఈ వెబ్ సిరీస్ కోసం అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందాన్ని కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక కొరటాల నిర్మించే వెబ్ సిరీస్ లో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి మెయిన్ రోల్ చేయనున్నారట. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తో  తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నవీన్ పొలిశెట్టి కొరటాల కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేసారట. ఇక దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొరటాల నిర్మాతగా రానిస్తారా లేదా చూడాలి.

More Related Stories