English   

విశాల్ కి విలన్ ఆ స్టార్ హీరో

Vishal Arya
2020-10-14 14:12:55

ఒకప్పుడు హీరోలంటే హీరో పాత్రలే చేయాలి..విలన్ అంటే విలన్ పాత్రలే చేయాలి..కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది హీరోలు విలన్లు అవుతున్నారు. విలన్లు హీరోలు అవుతున్నారు.  అంతే కాకుండా ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఒకరు హీరోగా మరొకరు విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఇలాగే ఇద్దరు హీరోలు ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, ఆర్య లు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విశాల్ హీరో కాగా ఆర్య విలన్ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ఆనంద్ తన సోషల్ మీడియాలో వెల్లడించాడు. సినిమాను వినోద్ కుమార్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. 

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో నోటా సినిమా తీరిన తరవాత ఆనంద్ శంకర్ రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఇక రెండేళ్ల గ్యాప్ తరవాత క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. సినిమాలో విశాల్ పాత్ర హైలెట్ గా నిలుస్తోందట. ఇక ఇప్పటికే తెలుగులో అల్లు అర్జున్ కి విలన్ గా నటించిన ఆర్య మరోసారి ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరో వైపు విశాల్ , ఆర్య ఇప్పటికే బాల దర్శకత్వంలో వచ్చిన "వాడు-వీడు" సినిమాలో కలిసి నటించారు. సినిమాలో ఇద్దరి నటనకు ప్రశంసలు కురిశాయి.

More Related Stories