English   

టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న మాస్ డైరెక్టర్

 Director Siva
2020-10-14 14:40:49

కోలీవుడ్ నుండి వచ్చి తెలుగులో చాలామంది డైరెక్టర్ లు సినిమాలు తీసి హిట్ కొట్టాడు. అలాగే సినిమాటోగ్రాఫర్ శివ తమిళుడు అయినప్పటికీ తెలుగులో మొదటి సినిమా గోపిచంద్ హీరోగా "శౌర్యం" తీసాడు. ఆ తరవాత మళ్ళీ గోపిచంద్ హీరోగా "శంఖం" తీసాడు. అది కూడా ఫ్లాప్ అయ్యింది. చాలా కాలం గ్యాప్ తీసుకుని రవితేజ తో "దరువు" తీసాడు. ఇక ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో చేసేది లేక మళ్ళీ సొంత గడ్డ కోలీవుడ్ పై అడుగు పెట్టి దర్శకుడిగా హిట్ల మీద హిట్లు కొట్టాడు. దాంతో స్టార్ హీరో అజిత్ తో సినిమా తీసే అవకాశం దక్కింది. 

ఇక వరుసగా విశ్వాసం, వేదాలం, వివేగం, వీరం వంటి సినిమాలు తీసి టాప్ డైరెక్టర్ అయ్యాడు. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా "అన్నాతై" అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో శివ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ప్రస్తుతం తాను తీస్తున్న రెండు సినిమాలు పూర్తయ్యాక మళ్ళీ తెలుగులో సినిమా తీయలంటున్నా అని వెల్లడించాడు. అయితే టాలీవుడ్ లో అల్లు అర్జున్ లేదా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తియ్యలన్నది శివ ఆలోచనట. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ సైతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మర మాస్ డైరెక్టర్ శివ ఇస్తున్న ఆఫర్ కు ఒకే చెబుతారా లేదా చూడాలి.

More Related Stories