English   

సీఎంలకు దర్శకుడు పూరీ రిక్వెస్ట్

Puri Jagannadh
2020-10-14 17:35:27

వ్యవసాయం పై ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్ ఆసక్తికర కామెంట్లు చేసాడు. వర్టీకల్ ఫామింగ్ అనే అంశంపై పూరి మాట్లాడుతూ..."మనమే రైతులా మారిపోవాలి. ప్రతి కిచన్ పక్కన కూరగాయలు పండించాలి. ప్రతి ఇంట్లో రైతు పుట్టాల్సిన సమయం వచ్చింది. ఇంటింటా వ్యవసాయం రావాలి.  ఎవరి కూరగాయలు వాళ్లే పండించుకోవాలి. ఇది జరగాలంటే ప్రభుత్వం అవగాహన కల్పించాలి. ఎంత మోటివేట్ చేసినా ఒక రైతు వర్టీకల్ ఫామింగ్ చేయలేడు. కారణం వర్టీకల్ కిట్లు కొనేంత స్థోమత రైతులకు ఉండదు. కాబట్టి ప్రభుత్వం రైతులకు అండగా ఉంది ఈ ఫామింగ్ ను ప్రోత్సహించాలి. వ్యవసాయం చేయలేక ఏ తండ్రి కూడా తన కొడుకుని మళ్ళీ వ్యవసాయం చేయాలని కోరడం లేదని..ప్రభుత్వమే గ్రామాల్లో పెద్ద షెడ్లు వేసి వర్టీకల్ ఫామింగ్ చేయాలని కోరారు. ఈ వ్యవసాయం ఇప్పుడు మొదలు పెడితే 25 ఏళ్ళ వరకు మన పిల్లలకు ఆహారం అందుతుందని అన్నారు. లేదంటే ఆహారం దొరకదు అని హెచ్చరించారు. ఈ పద్ధతి వల్ల ఎంతోమంది రైతులకు ఉపాధి దొరుకుతుంది. ఇది నా అభ్యర్థన దయచేసి ఆచరణలో పెట్టగలరు" అంటూ పూరీ ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లను అభ్యర్థించారు. ఇక ఈ డాషింగ్ డైరెక్టర్ చెప్పిన మాటలను ప్రధాని, సీఎం లు ఆచరణలో పెడతారో లేదో చూడాలి.

More Related Stories