అక్రమ గుట్కా రవాణా కేసులో సచిన్ జోషి అరెస్ట్

మార్చ్ నెలలో హైదరాబాద్ పోలీసులు గుట్కా తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. గుట్కా ముఠాను పోలీసులు విచారించగా సంచలన విషయాలు భయటకు వచ్చాయి. గుట్కా అక్రమ రవాణా లో నటుడు, ప్రముఖ వ్యాపారవేత్త సచిన్ జోషి హస్తం ఉందని నిందితులు తెలపడంతో హైదరాబాద్ పోలీసులు క్రిమినల్ పీనల్ కోడ్ 41 కింద కేసు నమోదు చెసి లుకవుట్ నోటీసులు జారీచేశారు. కాగా ఈరోజు సచిన్ జోషి దుబాయ్ నుండి ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగిన వెంటనే అతడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ నిమిత్తం అతడిని హైదరాబాద్ కు తరలించారు. విచారణలో సచిన్ జోషి పేరు చెప్పడంతో అతడిపై బహదూర్ పురా పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 336, 273 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ..."ఈ ఏడాది మార్చ్ లో హైదరాబాద్ లో 80 గుట్కా బాక్సులను పెట్టుకున్నాం. వాటివిలువ లక్షల్లో ఉంటుంది. ముఠా సచిన్ పేరు చెప్పడంతో అతడిని ఈరోజు ముంబై ఎయిర్ పోర్ట్ లో ఈరోజు అరెస్ట్ చేశాం." ఇదిలా ఉండగా సచిన్ జోషి సినిమాలతో పాటు ఇతర వ్యాపారాలు చేస్తుంటారు. ఆయన ఇతర భాషలతో పాటు తెలుగులో కొన్ని సినిమాల్లో నటించారు. చివరగా ఆయన తెలుగులో ఆశికి-2 రేమకబీలో నటించారు. ఇక గుట్కా కేసులో ఆయన పేరు రావడం ఆశ్చర్యకరంగా ఉంది.