English   

రష్మిక ఆమ్లెట్..నెవ్వర్ బిఫోర్..ఎవ్వర్ ఆఫ్టర్

Rashmika Mandanna
2020-10-15 11:39:14

చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. చలో సినిమా తరువాత రష్మిక "గీతా గోవిందం" సినిమాతో తెలుగులో ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఆ తరవాత  మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇదిలా ఉండగా రష్మిక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి దగ్గర మరింత దగ్గరగా ఉంటూ తన సినిమా అప్డేట్స్ మరియు పర్సనల్ లైఫ్ కి సంబందించిన విషయాలు షేర్ చేసుకుంటుంది. ఇక గత కొన్ని రోజులుగా తన వర్కౌట్స్ వీడియోలను సైతం రష్మిక సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో రష్మిక ఓసారి ఫుడ్ గురించి మాట్లాడుతూ ఆమ్లెట్ పై ఓ పోస్ట్ చేసింది. దాంతో ఆమె అభిమానులు ఆమ్లెట్ ఎలా చేయాలో వీడియోలో తెలపాలని కోరారు. దాంతో తాజాగా రష్మిక ఆమ్లెట్ ఎలా చేయాలో చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. వీడియోలో రష్మిక ఆమ్లెట్ చూస్తే అమాంతం నోట్లో పెట్టుకోవాలని అనిపిస్తోందంటూ చెప్పింది. అంతే కాకుండా మీరు కూడా ఈ ఆమ్లెట్ ను ట్రై చేయండి అంటూ తెలిపింది. ఇక రష్మిక ఆమ్లెట్ వీడియోకు ఆమె ఫ్యాన్స్ ఎగబడి లైకులు కొట్టేస్తున్నారు. అంతే కాకుండా షేర్ చేస్తున్నారు. ఇలాంటి ఆమ్లెట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

More Related Stories