English   

హిరణ్యకశ్యప సినిమాపై గుణశేఖర్ క్లారిటీ

 Gunasekhar Hiranyakashyap
2020-10-15 11:51:33

రుద్రమదేవి విడుదల తర్వాత దర్శకుడు గుణశేఖర్ చాలా గ్యాప్ తీసుకున్నారు. కొంత కాలం క్రితం ఆయన "హిరణ్యకశ్యప"అనే భారీ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆ ప్రాజెక్ట్ గురించి గుణశేఖర్ మళ్ళీ ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే ఆ తరవాత గుణశేఖర్ ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిఅతున్నారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా దానికోసం నెట్ఫ్లిక్స్ తో ఒప్పందం చేసుకున్నారని పుకార్లు వచ్చాయి. వాటిపై స్పందించిన గుణశేఖర్ తను ఎవరితోనూ ఒప్పందం చెలుకోలేదని అసలు తనకు వెబ్ సిరీస్ లు తీసే ఆలోచనే లేదని పేర్కొన్నారు. త్వరలోనే ఓ అప్డేట్ తో ముందుకు వస్తానని ప్రకటించారు. అన్నట్టుగానే ఇటీవల "శాకుంతలం" అనే సినిమాను తెరకెక్కిఅతున్నట్టు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో గుణశేఖర్ మొదట ప్రకటించిన హిరణ్యకశ్యప సినిమాను పక్కన పెట్టాశారు అంటూ వార్తలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన గుణశేఖర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హిరణ్యకశ్యప తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గుణశేఖర్ తెలిపారు. ఆ సినిమాను కచ్చితంగా తెరకెక్కిస్తానని అన్నారు. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలోనే ఆ సినిమాకు గ్యాప్ ఇచ్చామని అన్నారు. హిరణ్యకశ్యప ఎక్కువ మందితో షూటింగ్ చేయాలని భారీ సెట్లు అవసరమని అన్నారు. "శాకుంతలం" సినిమాకు పెద్దగా జనాలు అవసరం లేదని..తక్కువ మందితో షూట్ చేయవచ్చని చెప్పారు. మొదట శాకుంతలం చేయడానికి అదే కారణమని క్లారిటీ ఇచ్చారు.

More Related Stories