English   

ముప్పై పోలీస్ స్టేషన్లలో కుష్బూ పై కేసు

 Kushboo BJP
2020-10-15 17:54:46

ప్రముఖ నటి కుష్బూ రాజకీయాల్లోకి అడుగుపెట్టి చురుకుగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. డీఎంకే పార్టీతో మొదట రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కుష్బూ ఆ తరవాత 2019 లో కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ లో ఆమె చురుకైన పాత్రను పోషించారు. ఎప్పుడూ సామాజిక పరిస్థితులపై స్పందిస్తూ అందరి దృష్టిని కుష్బూ ఆకర్షించారు. అంతే కాకుండా 2019 ఎన్నికల సమయంలో తమిళనాడు, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రచార రథాన్ని ముందుండి నడిపించారు. ఇక ప్రస్తుతం కుష్బూ కాంగ్రెస్ నుండి భయటకు వచ్చి బిజేపి తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సంధర్బంగా కాంగ్రెస్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు పోలిస్ స్టేషన్ మెట్లు ఎక్కేవరకు తీసుకువచ్చాయి. 

కుష్బూ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ఇన్నాళ్లూ ఓ మానసిక వికలాంగుల పార్టీలో ఉన్నానంటూ మాట్లాడింది. దాంతో ఆమె పై 30 పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి. రాజకీయ నాయకురాలిగా ఇతర పార్టీలను తాను విమర్శించవచ్చని..కానీ ఆమె వ్యాఖ్యలు దివ్యంగులను అవమనపరిచే విధంగా ఉన్నాయని ఎన్పిఆర్డీ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై 30 పోలీస్ స్టేషన్లలో కేసులు పేటయినట్టు వివరించారు. చెన్నై, కోయంబత్తూరు, మధురై, తిరువూరు, తదితర పోలీస్ స్టేషన్ లలో కేసులు పెట్టినట్టు పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై కుష్బూ ఎలా స్పందిస్తారో చూడాలి.

More Related Stories