English   

దమ్ముకొడుతూ బాలయ్య డైలాగ్ చెప్పిన హాట్ హీరోయిన్

Ashima Narwal
2020-10-15 18:12:48

తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో నటించిన హీరోయిన్ ఆషిమా నార్వాల్ దమ్ముకొడుతూ బాలయ్య డైలాగ్ తో దుమ్ములేపింది. బాలయ్య నటించిన శ్రీమన్నారాయణ సినిమాలోని "డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్. ట్రబుల్ ట్రబుల్స్ యూ" అంటూ మధ్యలో సిగరెట్ తాగింది. అంతే కాకుండా పోస్ట్ లో ఆషిమా ఇలా పేర్కొంది." మనమంతా భూమాతను ఇబ్బంది పెడుతున్నామని. అందుకే భూమి మనల్ని ఇబ్బంది పెడుతోంది. భూమి ట్రబుల్ కాదు..ఇదే నిజం" అని చెబుతూ..హైదరాబాద్ లోని వరద బీభత్సాన్ని గుర్తుచేసింది. సిగరెట్ తాగుతున్న తనను చూసి షాక్ అయ్యేవారిని ఉద్దేశిస్తూ... స్కూటర్లు, ఫ్యాక్టరీలు చేసే కాలుష్యం చూసి ఎందుకు షాక్ అవ్వట్లేదు  అని ప్రశ్నించింది. 

ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాకుండా వీడియో కింద ఓ తెలుగు సినిమాలో క్యారెక్టర్ కోసం తాను సిగరెట్ తాగటం ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలిపింది. ఒక పోస్ట్ లో సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి హానికరం అని కూడా మెసేజ్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఆషిమా తెలుగులో జెస్సీ సినిమాలో నటించింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక సిగరెట్ తాగటం మాత్రం ఏ సినిమా కోసమో చెప్పలేదు. హాట్ భామ వీడియో చూసి బాలయ్య అభిమానులు ఖుషీ అవుతున్నారు.

More Related Stories