English   

ప్లాస్మాదానం చేసిన నాగబాబు..తమ్ముడు సూపర్ అంటూ చిరు

nagababu
2020-10-15 18:32:01

దేశంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా ను అదుపుచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంలేదు. ఇకఆ ఇప్పటివరకు కరోనా కు ఎలాంటి కచ్చితమైన మందు కానీ వ్యాక్సిన్ కానీ అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో కరోనా భారినపడి తీవ్ర అనారోగ్యం పాలైనవారిని కాపాడటానికి ప్లాస్మా దానం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. దాంతో ప్లాస్మా దాతలు ప్రాణాలు కాపాడటంలో కీలకంగా మారారు. ప్రభుత్వం కూడా ప్లాస్మా ధాతలు ముందుకు రావాలని కార్యక్రమాలు చేస్తూ..ప్లాస్మా దాతలను ప్రోత్సహిస్తుంది. మరోవైపు సెలెబ్రిటీలు సైతం కరోనా నుండి కోలుకున్న తరవాత ప్లాస్మా దానం చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

తాజాగా మెగా బ్రదర్ నాగబాబు సైతం ప్లాస్మాను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన నాగబాబు చికిత్స తీసుకుని కరోనాను జయించారు. అనంతరం ప్లాస్మా దానం చేశారు. దాంతో మెగాస్టార్ తన తమ్ముడిని సూపర్ అంటూ అభినందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. "కరోనాతో పోరాడి గెలవడమే కాదు, ఇంకా కొందరీని కాపాడే ప్రయత్నంలో cctలో ప్లాస్మాదానం చేసిన తమ్ముడు నాగబాబుకి అభినందనలు. ఈ సందర్భంగా కరోనా నుండి కొలుకున్నవారికి మరోమారు చేసే విన్నపం. మీరు ప్లాస్మా దానం చేస్తే ఎందరో కొలుకుంటారు. దయచేసి ముందుకు రండి" అంటూ మెగాస్టార్ పోస్ట్ పెట్టారు. ఇక ఇదివరకే హైదరాబాద్ పోలీసులు మెగాస్టార్ తో ప్లాస్మాదానం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మెగాస్టార్ పాల్గొని ప్లాస్మా దానం చేసినవారికి అభినందన పత్రాలు అందజేయడంతో పాటు ప్లాస్మా దానం చేసి ప్రాణాలను కాపాడాలని ప్రోత్సహించారు.

More Related Stories