English   

కరోనాను జయించిన మిల్కి బ్యూటీ

 Tamannaah
2020-10-16 08:13:14

దేశంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రెటీలపై సైతం కరోనా పంజా విసురుతోంది. ఇప్పటివరకు కరోనా బారిన పడి ఎంతోమంది సెలబ్రెటీలు కోలుకున్న సంగతి తెలిసిందే. ఇక గత కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో హీరోయిన్ తమన్నా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ముందుగా తమన్నా కుటుంబ సభ్యులకు కరోనా రావడంతో ఆమె టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. తరవాత ఆమెకు కొన్ని లక్షణాలు కనిపించడంతో రెండోసారి టెస్ట్ చేసుకోగా పాజిటివ్ వచ్చింది. దాంతో చికిత్స తీసుకున్న తమన్నా కరోనాను జయించి కొలుకున్నారు. దాంతో ఆమె ముంబైలోని తన నివాసానికి చేరుకున్నారు.  దాంతో కోలుకున్న విషయాన్ని మిల్కి బ్యూటీ సోషల్ మీడియాలో పంచుకుంది. తన ఇంటికి చేరుకున్న తమన్నా ఓ వీడియో  తీసుకుంది. వీడియోలో కారు దిగిన వెంటనే తమన్నా ఆమె తల్లిదండ్రులను మరియు పెట్స్ ని హగ్ చేసుకుంది. ఇంత త్వరగా కొలుకుంటా అని అనుకోలేదని, కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ ప్రార్ధనల వల్లనే త్వరగా కొలుకున్నానని తమ్మన్నా ఆనందం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఈ మిల్కి బ్యూటీ ప్రస్తుతం పలు సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది.
 

More Related Stories