English   

జమినీ గణేషన్ కూతురిని సైతం వేదించారట

Rekha
2020-10-16 08:32:31

అలనాటి బాలీవుడ్ రొమాంటిక్ హీరోయిన్ రేఖ. తెలుగుతో పాటు రేఖ తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. రేఖ మరెవరో కాదు ప్రముఖ దర్శకుడు, నటుడు జమినీ గణేషన్ కూతురు. తెలుగులో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన రేఖ ఆ తరవాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్ పక్కన సైతం నటించింది. 1970,80 కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఉపేసింది. అయితే ఇన్నేళ్లకు తనకు సైతం లైంగిక వేధింపులు తప్పలేదని రేఖ వెల్లడించింది. ప్రముఖ పుస్తక రచయిత యాసిర్ ఉస్మాన్ రేఖ జీవిత కథ ఆధారంగా "రేఖ ది అంటోల్డ్ స్టోరీ" అనే పుస్తకాన్ని రాశారు. 

ఆ పుస్తకంలో రేఖ తనకు ఎదురైన చేదు అనుభవాలు సైతం పేర్కొంది. బెంగాలీ నటుడు బిస్వాజిత్ తనను బలవంతంగా ముద్దు పెట్టాడని రేఖ వెల్లడించింది. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా బిస్వాజిత్ 5నిమిషాలపాటు ముద్దు పెట్టాడట. అయితే అక్కడ ఉన్న యూనిట్ సభ్యులు ఆపకపోగా కెమెరాను జూమ్ చేసి చప్పట్లు కొట్టారట. తాను నోరు మెదపకుండా కన్నీరు కారుస్తూ అలానే ఉండిపోయిందట. అనంతరం బిస్వాజిత్ ను నిలదీస్తే అతడు డైరెక్టర్ చెబితేనే అలా చేసానని నింద డైరెక్టర్ పై వేశాడట. ఇక ఈ విషయం వెలుగులోకి వచ్చాక జమినీ గణేషన్ కూతురికి సైతం వేధింపులు తప్పలేదని సినిమాలోకం చర్చించుకుంటుంది.

More Related Stories