English   

నోయల్ అందుకే తన భార్యతో విడిపోయాడు..గంగవ్వ

 Gangavva
2020-10-16 09:01:40

బిగ్ బాస్ సీజన్-4 సక్సెస్ ఫుల్ రేటింగ్ తో దూసుకుపోతుంది. మొదట్లో కంటెస్టెంట్ ల విషయంలో ప్రేక్షకులు కాస్త నిరాశకు గురికాగా షో మొదలైన కొన్నిరోజులకు కంటెట్ ఉండటంతో షోకు అడిక్ట్ అయ్యారు. ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఎలిమినేట్ కాకుండా అనారోగ్యం కారణంగా భయటకు వచ్చిన గంగవ్వ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టింది. తాజాగా ఓ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన గంగవ్వ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. హౌస్ లో నోయల్ గురించి గంగవ్వను అడగగా.నోయల్ చాలా మంచి వాడని చెప్పింది. వచ్చేటప్పుడు నోయల్ ఏడ్చాడని, భాగా అడమని సలహా ఇచ్చానని పెర్కొంది. 

ఇక నోయల్ తనగురించి మీకు ఏమైనా చెప్పారా అని ప్రశ్నించగా..నోయల్ కు పెళ్లి అయిందని కానీ విడాకులు అయ్యాయని తెలిపింది. విడాకులకు కారణం అతడి భార్య ఎస్తేర్ నోయల్ ను తల్లిదండ్రులను వదిలేసి ఎస్తేర్ తన తల్లిదండ్రుల వద్దకు రావాలని కోరిందట. ఇదిలాఉండగా నోయల్ ర్యాప్స్, పాటలు పడటం తో పాటు మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఎస్తేర్ కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది సునీల్ హీరోగా నటించిన "భీమవరం బుల్లోడు" సినిమాలో ఎస్తేర్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉండగా ఇటీవలే నోయల్-ఎస్తేర్ జంట తాము చట్టపరంగా విడాకులు తీసుకున్నామని సోషల్ మీడియాలో వెల్లడించింది.

More Related Stories