English   

అన్నపూర్ణ స్టూడియోస్ లో అగ్నిప్రమాదం

Annapurna Studios
2020-10-16 11:51:57

బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ ను ముంబై లో నిర్వహించిన నిర్వాహకులు ఆ తరవాత సీజన్లను హైదరాబాద్ లోనే సెట్ వేసి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ షో కోసం హౌస్ నిర్మించి నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా షోలో హోస్ట్ గా కూడా నాగార్జునను ఎంపిక చేసుకున్నారు. కాగా ఈరోజు అన్నపూర్ణ సుడియోస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు, పొగలు రావడంతో వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే ఓ సినిమా కోసం వేసిన సెట్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్టూడియో మేనేజర్ మీడియాకు వెల్లడించారు. పెద్దగా ఆస్తి నష్టం కూడా జరగలేదని పేర్కొన్నారు. ఇక సుడియోస్ లో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-4 నదువుతుండటంతో హౌస్ లో ఉన్నవారి పరిస్థితి ఏంటని ప్రేక్షకులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బిగ్ బాస్ హౌస్ ప్రమాదం జరిగిన చోటు నుండి దూరంగా ఉండతో హౌస్ వరకు మంటలు వ్యాపించలేదు. హౌస్ లో అందరూ సేఫ్ గా ఉన్నారు.

More Related Stories