English   

సొంత బ్యానర్లో సినిమా అనౌన్స్ చేసిన యంగ్ హీరో

Anish Krishna Naga Shourya
2020-10-16 17:14:40

హీరో నాగ‌శౌర్య‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ కాంబినేష‌న్‌లో ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 4గా ఒక రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌ను నిర్మించేందుకు ఐరా క్రియేష‌న్స్ స‌న్నాహాలు ప్రారంభించింది. శుక్రవారం సోష‌ల్ మీడియాలో కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయ‌డం ద్వారా అఫిషియ‌ల్‌గా ఆ మూవీని ప్ర‌క‌టించారు. ఉష ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఆహ్లాద‌క‌ర‌మైన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నుంది. డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ‌కు ఇది మూడో సినిమా. ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఇదివ‌ర‌కు నాగ‌శౌర్య సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'ఛ‌లో'కు ఆయ‌న బ్లాక్‌బ‌స్ట‌ర్ మ్యూజిక్ అందించారు. ఆ సినిమాలోని 'చూసీ చూడంగానే..' సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో మ‌న‌కు తెలుసిందే. షూటింగ్‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి చేయ‌నున్నారు. ఇదిలా ఉండగా యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 2011లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య "లక్ష్మీ రావే మా ఇంటికి" సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తరవాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ "ఛలో" తో మరో హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు.

More Related Stories