English   

అధీర బ్యాక్..షూటింగ్ కి సంజయ్ దత్ రెడీ

Sanjay Dutt
2020-10-16 17:40:25

కేజీఎఫ్ భారీ విజయంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ పై అంచనాలు పెరిగాయి. దాంతో కేజీఎఫ్-2 ను ప్రశాంత్ నీల్ ఒక సవాల్ గా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. ప్యాన్ ఇండియా సినిమాగా కేజీఎఫ్2 ను తెరకెక్కిస్తున్నాడు. దాంతో కన్నడ పరిశ్రమతో పాటు బాలీవుడ్, ఇతర పరిశ్రమల నుండి ప్రముఖ నటులను కేజీఎఫ్ 2 లో భాగం చేశారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ ను సైతం ఎంపిక చేసాడు. అంతే కాకుండా సంజయ్ దత్ కేజీఎఫ్2లో మెయిన్ విలన్ అధీర పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే అధీర లుక్ భయటకు వచ్చి ప్రశంసలు పొందింది. అయితే కొద్ది రోజుల క్రితం సంజయ్ దత్ క్యాన్సర్ భారిన పడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. సంజయ్ దత్ కు 4వ దశ లంగ్ క్యాన్సర్ అని తేలడంతో ఆయన వెంటనే చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. 

అయితే ఇటీవల సంజయ్ మళ్ళీ ఇండియాకు చేరుకున్నారు. సంజయ్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫొటోలో సంజయ్ చాలా సన్నగా అయిపోయారు. దాంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. అంతేకాకుండా సంజయ్ కేజీఎఫ్-2 లో నటించగలరా లేదా? అన్న ప్రశ్న కూడా మొదలైంది. ఇక అలాంటి ప్రశ్నలకు సమాధానం చెబుతూ సంజయ్ కేజీఎఫ్-2 షూటింగ్ లో పాల్గొంటున్నట్టు క్లారిటీ ఇచ్చేసారు. ఈ విషయం భయటకు వచ్చాక సంజయ్ దత్ ఎంతైనా గ్రేట్ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. త్వరలోనే సంజయ్ క్యాన్సర్ ను కూడా జయిస్తాడాని చెబుతున్నారు. ఇక సంజయ్ దత్ అధీర పాత్రలో ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

More Related Stories