English   

బెంగళూరులో సినిమా హాల్స్ ప్రారంభం.. సగం నిండిన ప్రేక్షకులు..

Theatres
2020-10-16 18:44:03

అక్టోబర్ 15 నుంచి థియేటర్ లతో పాటు మల్టీప్లెక్సులు కూడా చేర్చుకోవచ్చు అంటూ కేంద్రం ఇచ్చిన అనుమతిని తెలుగు రాష్ట్రాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ పక్కనే ఉన్న బెంగళూరులో మాత్రం మల్టీప్లెక్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడ విడుదలకు కొత్త సినిమాలు లేకపోయినా కూడా పాత సినిమాలు మరోసారి రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు. వాటిని చూడడానికి కూడా మూవీ లవర్స్ థియేటర్స్ కు క్యూ కట్టారు. తాజాగా బెంగళూరులో ఓపెన్ చేసిన మల్టీప్లెక్స్ లలో సగం వరకు ప్రేక్షకులు నిండిపోయారు. పూర్తిగా కోవిడ్ నిబంధనలకు లోబడి థియేటర్స్ ఓపెన్ చేశారు. సరిగ్గా కరోనా వైరస్ ఇండియాలో వచ్చే ముందు విడుదలైన సినిమాలు ఇప్పుడు మరోసారి రిలీజ్ చేశారు. లాక్ డౌన్ కారణంగా అప్పట్లో తన సినిమాలకు పెద్దగా కలెక్షన్స్ రాలేదని నిర్మాతలు తలలు పట్టుకున్నారు. అలాంటి సినిమాలను మళ్ళీ ఇప్పుడు విడుదల చేస్తున్నారు. 

మార్చిలో విడుదలై పెద్దగా కలెక్షన్లు తీసుకురాని సినిమాలను మళ్లీ ఇప్పుడు విడుదల చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఏడు నెలలుగా థియేటర్ల మొహం చూడని ప్రేక్షకులు పాత సినిమాలు అయినా పర్లేదు అని మళ్లీ వస్తున్నారు. సీటుకు సీటుకు మధ్యలో గ్యాప్ ఇచ్చి పూర్తిగా శానిటైజర్ వేసి మల్టీప్లెక్సులు తెరిచారు. ప్రస్తుతం అక్కడ హిందీ సినిమాలతో పాటు దివంగత చిరంజీవి సర్జా నటించిన శివార్జున సినిమాను కూడా మరోసారి విడుదల చేశారు. ఈయన మరోసారి వెండితెరపై చూడాలి అనుకుంటున్న అభిమానులు థియేటర్లకు వస్తున్నారు. జూన్ 7న చిరంజీవి గుండెపోటుతో కన్నుమూశాడు. దాంతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యాయి. పాత సినిమాలు అయినా కూడా థియేటర్ల ముందు జనం కనిపించడంతో నిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో చూడాలి. 

More Related Stories