English   

కత్తి కార్తీక పై కేసు..మోసం చేసిందంటూ

 Kathi Karthika
2020-10-17 10:49:28

కత్తి కార్తీక  పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. ఒక ఇష్యూ సెటిల్ చేస్తా అంటూ కోటి రూపాయలు తీసుకుని మోసం చేసిందంటూ కార్తీకపై, ఆమె అనుచరులపై ఫిర్యాదు చేశారు. అమీన్పుర్ వద్ద 52 ఎకరాల భూమినీ ఒక ప్రైవేట్ కంపెనీ కి ఇప్పించేందుకు కార్తీక మధ్యవర్తిత్వం వహించింది. ఈ క్రమంలో కార్తీక ఆమె అనుచరులు బాధితుడి దగ్గర కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. కార్తీక మోసం చేసిందటూ బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. ఇదిలా ఉండగా కత్తికార్తీక తెలుగులో రేడియో జాకీ గా గుర్తింపు పొందారు. అనంతరం టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి ఓ న్యూస్ ఛానల్ లో దిల్ సే కతీక అనే షో తో పాపులర్ అయ్యారు. ఈ షోలో రాజకీయ సినీ ప్రముఖులను ఆమె ఇంటర్వ్యూ చేశారు. అనర్గళంగా మాట్లాడటం, ఇంటర్వ్యూలో ప్రశ్నలు కురిపించడం కార్తీక స్టైల్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ -1 లో కంటెస్టెంట్ గా కార్తీక మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం రాజకీయాలపై ఆసక్తితో దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కార్తీక ల్యాండ్ ఇష్యూ లో ఇరుక్కోవడంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు.
 

More Related Stories