English   

ఇది తింటే ఆరోగ్యంగా ఉంటారు..నమ్రత ఆసక్తికర ట్వీట్

 Namrata Shirodkar
2020-10-17 12:37:14

మహేష్ బాబు సతీమణి నమ్రత వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ట్వీట్ లో ఎలాంటి ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారో నమ్రత వెల్లడించారు. ముఖ్యంగా ఆర్గానిక్ ఫుడ్ తీలుకోవడంవల్ల ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు.  ఆరోగ్యంగానే కాకుండా ఆనందంగా కూడా ఉంటారని నమ్రత తెలిపారు. తన పోస్ట్ లో అన్నం కూరలతో ఉన్న ఒక నోరూరించే ఫోటోను నమ్రత షేర్ చేశారు. "మీకు నచ్చిన ఆహారాన్ని తీలుకోండి. ఏం తింటున్నారో దాన్ని ఇష్టపడి తినండి. ఆరోగ్యమైన ఆహారం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అది పోషకాహారమే కాకుండా..ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది. రుచిగా ఉందా లేదా అని దానిపై చర్చలు పెట్టాల్సిన అవసరంలేదు. ఆహారం అనేది స్వీయ సంరక్షణ అని తెలుసుకోండి. మీ ఆహారాన్ని మీరే సమకూర్చుకోండి" అంటూ నమ్రత ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా నమ్రత ప్రముఖ హీరోయిన్ అయినప్పటికీ హీరో మహేష్ బాబును పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఆ తరవాత పిల్లలు, మహేష్ లే జీవితంగా నమ్రత తన కాపురాన్ని కొనసాగిస్తోంది.   ఎప్పుడూ తన పిల్లలు ఆడే ఆటలు, వారి టాలెంట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. ఇక గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ నమ్రత ఇంట్లోనే వండుకోవలని చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఎక్కువమంది భార్యలు ఇంట్లో వండుకోవడం కంటే హోటల్ ఫుడ్ బుక్ చేసుకోవడమే పనిగా పెట్టుకుని ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు.
 

More Related Stories