English   

కళా దర్శకులు శ్రీ ఆనంద సాయిని సన్మానించిన పవన్ కల్యాణ్

 Pawan Kalyan
2020-10-17 13:24:05

యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్, ప్రముఖ కళా దర్శకులు శ్ర్రీ ఆనంద సాయి ఇటీవలే ‘ధార్మిక రత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం స్వీకరించిన సందర్భంగా...జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు శుక్రవారం సాయంత్రం శ్రీ ఆనంద సాయిని అభినందించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ శ్రీ ఆనంద సాయిని శాలువాతో సత్కరించి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్టతో పాలుపంచుకోవడం ప్రశంసనీయం అన్నారు. ఆలయ నిర్మాణం, సంబంధిత వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసిన ఆయనకు ధార్మిక రత్న పురస్కారం దక్కడం సముచితం అని చెప్పారు. నటులు శ్రీ నర్రా శ్రీను ఈ సత్కారంలో పాల్గొని అబినందనలు తెలియచేశారు.

శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఇటీవల హైదరాబాద్ లోని బిర్లా ఆడిటోరియమ్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా శ్రీ ఆనంద సాయి ‘ధార్మిక రత్న’ పురస్కారం స్వీకరించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు. లాక్ డౌన్ తరవాత ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. అంతే కాకుండా పవన్ పలు ప్రాజెక్టులకు సైతం ఒకే చెప్పారు. పవన్ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ ప్రస్తుతం చురుకుగా ఉంటూ రాజేకీయ అంశాలపై స్పందిస్తున్నారు.

More Related Stories