English   

ఆ హీరోల చావును క్యాష్ చేసుకుంటున్న నిర్మాతలు..

Chiranjeevi Sarja
2020-10-17 13:43:14

అభిమాన హీరోల సినిమాలు థియేటర్లో చూడటానికి ఇష్టపడతారు ప్రేక్షకులు. కానీ కరోనా వైరస్ పుణ్యమా అని చాలామంది హీరోల సినిమాలు నేరుగా టీవీలో చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాటిని సరిదిద్దుకునే పనిలో పడ్డారు నిర్మాతలు. అందులోనూ కొందరు హీరోలు లాక్ డౌన్ సమయంలో ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. బాలీవుడ్ లో ఇర్ఫాన్ ఖాన్ ఏప్రిల్ 29 న మరణించాడు. చాలా సంవత్సరాలుగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఇక జూన్14న బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి సరిగ్గా వారం ముందు జూన్ 7న కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. కేవలం 35 ఏళ్ల వయసులో ఈయన చనిపోవడం అభిమానులు తీవ్రంగా కలచివేసింది. దాంతో ఈ ముగ్గురు హీరోలు ఎప్పటికీ ఇంక మనకు కనిపించరు అని తెలిసి వాళ్లు నటించిన చివరి సినిమాలు వెండితెరపై చూడటానికి ఇష్టపడుతున్నారు అభిమానులు. కానీ వైరస్ కారణంగా అది సాధ్యపడలేదు. 

ఇప్పుడు మళ్లీ థియేటర్స్ ఓపెన్ కావడంతో వాళ్ల సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. అభిమానులు ఆ సినిమాలను బాగానే ఆదరిస్తున్నారు. తమకు నచ్చిన హీరోలను చివరిసారిగా సిల్వర్ స్క్రీన్పై చూడటానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. కన్నడలో చిరంజీవి సర్జా చివరి సినిమా శివార్జునకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆయన బతికున్నప్పుడు విడుదలైన ఈ సినిమాకు అంతగా పాజిటివ్ టాక్ రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం సినిమాను చూడటానికి అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఆయన కటౌట్ కు పాలాభిషేకాలు చేస్తున్నారు. మరోవైపు సుశాంత్ సింగ్ చివరి సినిమా దిల్ బేచార కూడా థియేటర్లలో కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఈ హీరోలు చనిపోయిన తర్వాత ఈ సినిమాలకు డిమాండ్ పెరిగింది.  

More Related Stories