English   

మహానటిని విష్ చేసిన మహేష్ బాబు

 Mahesh Babu
2020-10-17 13:53:07

చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే హీరోయిన్ కీర్తి సురేష్. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి ఆ తరవాత కొన్నేళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన చదువును పూర్తి చేసింది. అనంతరం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కీర్తి సురేష్ తెలుగులో "నేను శైలజ, నేను లోకల్, మహానటి" సినిమాలతో పాపులర్ అయింది. ఇక తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో విడుదలైన "మహానటి" సినిమా కీర్తి కెరీర్ లో ఓ గొప్ప సినిమాగా పేరుతెచ్చిపెట్టింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రకు అచ్చుగుద్దినట్టుగా సరిపోయింది. దాంతో కీర్తి నటనకు జాతీయ ఉత్తమనటి అవార్డు లభించింది. ఇదిలా ఉండగా ఈరోజు మహానటి కీర్తిసురేష్ తన 29వ పుట్టునరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులు, నటీనటులు కీర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సైతం కీర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "టాలెంటెడ్ కీర్తి సురేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సర్కారు వారి పాట టీం మీకు ఫారెన్ వెళ్ళడానికి స్వాగతం పలుకుతోంది. ఈ సినిమా మీ కెరీర్ లో ఒక గొప్ప సినిమా అవుతుందని కచ్చితంగా చెప్పగలను" అంటూ మహేష్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి హీరోయిన్ గా నటిస్తోంది . ఈ సినిమాకు పారశురాం దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా తమన్ స్వరాలను సమకూరుస్తున్నారు.

More Related Stories