English   

జీవితా రాజశేఖర్ కు కరోనా

Rajasekhar
2020-10-17 15:26:08

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంలేదు. రేపు..మాపు అంటూ వ్యాక్సిన్ ను ఇప్పటివరకు అందుబాటులోకి తీసుకురాలేదు. మరోవైపు వ్యాక్సిన్ వచ్చినా కరోనా ను అదుపు చేయడం కష్టమని డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యానించింది. ఇక సాధారణ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు సైతం వైరస్ భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు పలువురు సినిప్రముఖులు కరోనా బారిన పడి కొలుకున్నారు. మరికొందరు కరోనాతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇక తాజాగా హీరో రాజశేఖర్ కుటుంబం సైతం కరోనా బారిన పడింది. రాజశేఖర్ తో పాటు జీవిత మరియు వారి ఇద్దరి కూతుర్లకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో రాజశేఖర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో కుటుంబం త్వరగా కరోనా జయించాలని ప్రార్థనలు చేస్తున్నారు.  ఇదిలా ఉండగా రాజశేఖర్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన సతీమణి జీవిత పలు టీవీ షోలు చేస్తున్నారు. ఇక జీవిత-రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని "దొరసాని" సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినప్పటికీ శివాని నటనకు మంచి మార్కులు పడ్డాయి.

More Related Stories