English   

దసరాకు ప్రదీప్ శ్రీముఖి పెళ్లి..ఇదే ప్రూఫ్

Sreemukhi
2020-10-17 20:56:39

తెలుగు టీవీ ఛానళ్లు పండుగలకు రేటింగ్ ను పెంచుకోవడానికి శతకోటి ప్రయత్నాలు చేస్తుంటాయి. దసరా ఉత్సవాలు, దీపావళి ఉత్సవాలు అంటూ సీరియల్, టీవీ ఆర్టిస్టులను తీసుకువచ్చి హంగామా సృష్టిస్తాయి. అయితే ఈ మధ్య టీవీ ఛానళ్లు కొత్త ట్రెండ్ ను తీసుకువచ్చాయి. పెళ్లిళ్లు కాని వారికి పెళ్లిళ్లు చేస్తూ టిఆర్పీ ని పెంచుకుంటున్నాయి. అయితే చేసేది నిజమైన పెళ్లి కాదు ఉత్తుత్తి పెళ్లి. కానీ ప్రేక్షకులు మాత్రం ఆ పెళ్లిని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో ఓ టీవీ చానెల్ ఇలానే ప్రదీప్-రష్మికి పెళ్లి జరిపించగా ఛానల్ కు ఒక రేంజ్లో టిఆర్పీ వచ్చింది. దాంతో ఇప్పుడు అదే దారిలో జితెలుగు కూడా నడుస్తోంది. ఈ దసరాకు యాంకర్స్ ప్రదీప్-శ్రీముఖి పెళ్లి అంటూ ప్రచారం చేస్తోంది. అంతే కాకుండా ఇప్పటికే ఓ వెడ్డింగ్ కార్డు కూడా కొట్టించింది. ఇదిలా ఉండగా ప్రదీప్ తెలంగాణకి చెందిన ఒక రాజకీయ నాయకుడి కూతురును త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అని వార్తలు చక్కర్లు కొట్టగా... శ్రీముఖి మరో రెండు సంవత్సరాల వరకు పెళ్లి పీటలు ఎక్కబోనని స్పష్టం చేసింది. ఇక ఛానెల్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడంతో పిచ్చి పీక్స్ కు చేరించని కొందరు భావిస్తుండగా...మరి కొందరు మేం ప్రేక్షకులం మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. అంటూ చానల్స్ ను ఎంకరేజ్ చేస్తున్నారు.

More Related Stories