English   

డిసెంబర్ లో పెళ్ళి పీటలు ఎక్కనున్న మెగా డాటర్

Niharika Konidela
2020-10-18 12:19:53

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల గుంటూరుకు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ కుమారుడు చైతన్య ను ప్రేమ వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చైతన్య-నిహారిక ల నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నిశ్చితార్ధానికి అతి తక్కువ మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఆగస్టు 13న జరిగిన ఈ జంట నిశ్చితార్ధానికి మెగా కుంటుంభం నుండి రాంచరణ్-ఉపాసన, అల్లు అర్జున్- స్నేహ, సాయిధరమ్ తేజ్ మరి కొందరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక ఉపాసన-చైతన్య పెళ్లి పీటలు ఎక్కడానికి  సిద్ధమయ్యారు. డిసెంబర్ లోనే వీరి వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మెగా బ్రదర్ నాగబాబు కు ఏకైక కుమార్తె కావడంతో పెళ్లిని చాలా గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే వివాహానికి వచ్చే అతిథుల సంగతి నాగబాబు ఆయన సతీమణి చూసుకుంటుండగా...వరుణ్ తేజ్ పెళ్లికి సంబందించిన అన్ని ఏర్పాట్లని దగ్గరుండి చూస్కుంటున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ వెలుపల భారీ డెస్టినేషన్ వెడ్డింగ్ కు వరుణ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పెళ్లి కోసం ఇప్పటికే మూడు ప్రదేశాలను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ నెలాఖరులోగా ఎక్కడ ఏర్పాట్లు చేయాలన్నది నిర్ణయించనున్నారు.

More Related Stories