English   

బీచ్ లో రానా మిహికా జంట..సెల్ఫీ వైరల్

Rana Daggubati
2020-10-18 12:38:51

లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ లో ఎన్నో జంటలు ఒక్కటయ్యాయి. రానా-మిహికా బజాజ్ కూడా లాక్ డౌన్ కాలంలోనే పెళ్లి పీటలు ఎక్కారు. కరోనా ఆంక్షలు ఉండటంతో రానా-మిహికా హనీమూన్ కి కూడా వెళ్ళలేదు. అయితే ఒక షోలో చిట్ చాట్ చేసిన రానా హనీమూన్ కి ఎప్పుడు వెళతారు. అని యాంకర్ ప్రశ్నించగా లాక్ డౌన్ తరవాత వెళతాం అని సమాధానం ఇచ్చారు. ఎక్కడకు వెళతారు అని ప్రశ్నించగా ఆమ్స్టర్ డమ్ అని సమాధానం ఇచ్చారు. ఇక తాజాగా శనివారం రానా సతీమణి మిహికా బజాజ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫోటోను షేర్ చేసింది. ఫోటోలో రానా మిహికా ఒక బీచ్ లో కలిసి ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక పోస్ట్ లో మిహికా "ఇప్పుడే ఎందుకంటే" అంటూ పేర్కొన్నారు. ఫోటోలో రానా స్టయిలిష్ గా కనిపిస్తున్నారు. ఇక ఫోటో షేర్ చేరిన నిమిషాల్లోనే వైరల్ గా మారింది. రానా అభిమానులు తమ అభిమాన హీరో హనీమూన్ ట్రిప్ లో ఉన్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే వారు హనీమూన్ కు వెళ్ళారా లేదంటే ఎక్కడికైనా వెళ్ళారా అనేది ఇంకా స్పష్టంకాలేదు. ఇక పెళ్లి తరవాత రానా-మిహికా కలిసి దిగిన ఫొటో ఇదే కావడం విశేషం. ఇదిలా ఉండగా ప్రస్తుతం రానా పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కి ముందు రానా చివరగా "ఎన్టీఆర్ మహనాయకుడు, హౌస్ ఫుల్ 4" సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన హిరణ్యకశ్యప,  అరణ్య, విరాట పర్వం లాంటి సినిమాల్లో నటించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

More Related Stories