English   

బిగ్ బాస్ పై ప్రేక్షకుల అసంతృప్తి..ఓట్లు వేసి లాభంలేదా

Bigg Boss Telugu
2020-10-18 12:44:32

బిగ్ బాస్ సీజన్-4 పై ప్రేక్షకులు మొదటినుండి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో కంటెస్టెంట్స్ పరిచయం లేని వాళ్ళని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే షోలో రొమాన్స్ మొదవ్వడం, చిన్న చిన్న గొడవలు రావడంతో క్రమంగా షో పై ఆసక్తి పెరిగింది. కాగా గతవారం నుండి జరుగుతున్న ఎలిమినేషన్ ప్రాసెస్ పై నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. మొన్న సోహెల్ కి పవర్స్ ఇచ్చి మెహబూబ్ ను సేవ్ చెయ్యడం, నిన్న నాగార్జున అరగుండు టాస్క్ ఇచ్చి అమ్మ రాజశేఖర్ ను సేవ్ చేయడం చూస్తుంటే అంతా స్క్రిప్టెడ్ అంటూ మండిపడుతున్నారు. ఎవరిని కావాలంటే వాళ్ళని సేవ్ చేసుకున్నాక ఇంకా ప్రేక్షకుల వోటింగ్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. నెటిజన్లు ఈ రేంజ్ మండి పడటానికి కారణం మెహబూబ్, అమ్మ రాజశేఖర్ ను ప్రేక్షకులు ఎప్పుడు భయటకు పంపించాలా అన్నట్టు చూడటమే. కానీ బిగ్ బాస్ మాత్రం వాళ్ళను ఎలిమినేషన్ నుండి తప్పిస్తూ సేఫ్ గేమ్ అడుతున్నాడు. 

ఇదిలా ఉండగా ఓట్లను కూడా బిగ్ బాస్ లెక్కించడం లేదని అనుమానాలు కూడా వస్తున్నాయి. కారణం సోషల్ మీడియాలో ఎలిమినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో కొంతవరకు మంచి ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ కుమార్ సాయి. అతడికి సోషల్ మీడియాలో బాగానే సపోర్ట్ ఉంది ఎక్కడ వోటింగ్ పోల్స్ చూసుకున్నా కుమార్ సాయి కి బాగానే ఓట్లు పడినట్టు కనిపించింది. కానీ ఇపుడు అతడే ఎలిమినేట్ అయ్యడంటూ వార్తలు వస్తున్నాయి. దాంతో బిగ్ బాస్ ప్రోమో కింద ఇక షో చూడటమే మనేస్తామని అభిమానులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అంతే కాకుండా టివి9 దేవిది కూడా ఫేక్ ఎలిమినేషన్ అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ స్థాయిలో బిగ్ బాస్ పై విమర్శలు రావడం ఇదే మొదటిసారి.

More Related Stories