English   

అప్పుడు చచ్చిపోవాలని అనిపించింది.. జెర్సీ నటి

 Actor Sanusha
2020-10-19 08:30:14

నటీనటుల జీవితాలు తెరపై కనిపించే అంత అందంగా ఉండవని కొన్నిసార్లు వాళ్ల ఇంటర్వ్యూలు చూసినప్పుడు అర్థం అవుతుంది. ఇక నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరవాత ఎంతోమంది తమ లైఫ్ లో డిప్రెషన్ లో ఉన్న సమయం గురించి మీడియా ముందు వెల్లడిస్తున్నారు. తాజాగా జెర్సీ నటి  సానూష కూడా తన జీవితంలో వచ్చిన డిప్రెషన్ సమయం గురించి వెల్లడించింది. సనూష జెర్సీ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో నటించింది. బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సానూష "బంగారం" సినిమాలో హీరోయిన్ చెల్లెలిగా నటించింది. ఇక తరవాత జీనియస్, రేణిగుంట సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఇక తాజాగా సనూష ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమెపై ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.దాంతో ట్రోల్స్ చేస్తున్న వారికి సమాధానమిస్తూ సానూష మరో వీడియోను పోస్ట్ చేసింది.  

వీడియోలో ఈ భామ మాట్లాడుతూ..నా మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటంపై నెటిజన్లు నన్ను ట్రోల్ చేస్తున్నారు. "మానసిక క్రుంగుబాటు తో ఇబ్బంది పడేవాళ్ళకి నా వీడియో కొంతైనా ధైర్యాన్ని ఇస్తుందనే ఉద్దేశ్యంతోనే నేను ధైర్యంగా మాట్లాడగలిగాను" అంటూ సమాధానం చెప్పింది. కాగా మనూష ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సంధర్భంగా  తాను కూడా కొన్నిరోజులు మానసిక సమస్యలతో భాధపడ్డానని చెప్పింది. కొన్ని సార్లు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు కూడా వచ్చాయని పేర్కొంది. దాంతో డాక్టర్ ను సంప్రదించి సలహాల మేరకు ఆ స్థితి నుండి భయట పడ్డానని వెల్లడించింది.

More Related Stories