English   

బాబు ది గ్రేట్..వెయ్యికి పైగా గుండె ఆపరేషన్లు

  Mahesh Babu
2020-10-19 08:41:43

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు కేవలం సినిమాల్లో మెసేజ్ లు ఇవ్వడమే కాకుండా నిజ జీవితంలోనూ మంచి పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తుంటాడు. మహేష్ బాబు శ్రీ మంతుడు సినిమాలో ఊర్లను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. అయితే సినిమా విజయం తరవాత మహేష్ స్వయంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసాడు. దాంతో ఆయన పలువురికి ఆదర్శంగా నిలిచాడు. మహేష్ ఊరిని దత్తత తీసుకున్న తరవాత కొందరు రాజకీయ ప్రముఖులు కూడా ఊర్లను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇదిలా ఉండగా మహేష్ చిన్నారుల కోసం ఓ సామాజిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారులకు ఆంధ్ర హాస్పిటల్స్, లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ తో కలిసి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇప్పటివరకు మహేష్ ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 1000 గుండె ఆపరేషన్లు చేయించారు. ఇక తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు సైతం ఆపరేషన్ చేయించారు. ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత తన సోషల్ మీడియాలో వెల్లడించింది. మరో రెండు గుండెలు మా కుటుంబంలో భాగమయ్యాయి అంటూ నమ్రత ట్వీట్ చేసింది. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న ఇద్దరు చిన్నారుల ఆరోగ్యాలు కుడుటపడుతున్నాయి. దానికి సంతోషిస్తున్నామని పేర్కొంది. మతే కాకుండా ఆంధ్రా హాస్పిటల్ కు నమ్రత కృతజ్ఞతలు తెలిపింది.

More Related Stories