English   

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో మరో ట్విస్ట్..

 Girlfriend Gabriella
2020-10-19 16:40:34

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయి నాలుగు నెలలు అవుతున్నా కూడా ఇప్పటికే ఆయన మరణంపై సస్పెన్స్ వీడడం లేదు. ఇప్పటికీ ఆయన కేసులో మిస్టరీ అలాగే ఉండిపోయింది. ఆత్మహత్య దగ్గరనుంచి డ్రగ్స్ కుంభకోణం వరకు ఎన్నో కోణాలు బయటకు వచ్చాయి. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం తాజాగా చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ కోణం వెలుగు చూడడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సీ.బీ) ఆ దిశగా విచారణ మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో బాలీవుడ్ ప్రముఖులతో పాటు మరింత మందిని విచారించారు. దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ ఇలా చాలా మందికి నోటీసులు పంపించి వాళ్ళని విచారించారు ఎన్సీబీ అధికారులు. ఈ క్రమంలోనే నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలు గాబ్రియెల్ల సోదరుడిని అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది.

ఈ కేసులో గాబ్రియెల్ల సోదరుడికి సంబంధం ఉన్నట్లు తేలడంతో ఎన్.సీ.బీ అతడిని రిమాండ్ లోకి తీసుకుంది. దక్షిణాఫ్రికా జాతీయుడైన అగిసిలాస్ ను డ్రగ్ పెడ్లర్లతో కలిసి సన్నిహితంగా మెలిగాడనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే అరెస్ట్ చేసిన ఎన్.సీబీ. అధికారులు కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే సుశాంత్ కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ ను సుశాంత్ మేనేజర్ శామ్యూల్ ను పర్సనల్ స్టాఫ్ దీపేశ్ సావంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రియా చక్రవర్తి 28 రోజులు జైల్లో ఉండి ఈ మధ్య బెయిల్ పై విడుదలైంది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇంకా చాలామందికి సంబంధాలు ఉన్నాయని అధికారులు విచారణలో తెలిపారు. 

More Related Stories