English   

టక్ జగదీష్ షూటింగ్ కు మళ్ళీ బ్రేక్

 Nani Tuck Jagdish
2020-10-19 17:14:54

కరోనా లాక్ డౌన్ తరవాత షూటింగ్ లు తిరిగి ప్రారంభం అయ్యాయి. దాంతో కరోనా నిబంధనలు పాటిస్తూ చిత్ర యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న "టక్ జగదీష్" షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. అయితే షూటింగ్ ప్రారంభం అయిన కొన్నిరోజులకే మళ్లీ షూటింగ్ కి బ్రేక్ పడింది. టక్ జగదీష్ టీంలోని ఓ టెక్నీషియన్ కరోనా భారిన పడటంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. టెక్నీషియన్ కు కరోనా పాజిటివ్ రావడంతో యూనిట్ సభ్యులందరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ లో జరుగుతోంది. కరోనా పాజిటివ్ వచ్చిన టెక్నీషియన్ కోలుకున్న తరువాతనే మళ్ళీ తిరిగి షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఇక సినిమాలో నటిస్తున్న నాని తో పాటు దర్శకుడు శివ నిర్వణ, మిగతా యూనిట్ సభ్యులు సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నాని సరసన రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తవగా మళ్ళీ తిరిగి ప్రారంభించిన తరవాత అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన టక్ జగదీష్ పోస్టర్లు మాత్రం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. దాంతో నాని అభిమానులు సినిమా ఎప్పుడు థియేటర్లో రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

More Related Stories