English   

సమంత ఫోటో షూట్ పై ఉపాసన ఆసక్తికర వీడియో

Samantha Akkineni
2020-10-20 10:20:56

రాంచరణ్ భార్య ఉపాసన అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా విధులు నిర్వర్తిస్తూ ఆరోగ్యం, మానవ పరిపుష్టి కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని, వారి జీవన విధానంలో మార్పులు తేవడానికి వారిలో అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. యు ఆర్ లైఫ్ అనే మ్యాగజైన్, యూట్యూబ్ ఛానల్ ను ఉపాసన గత కొద్ది రోజుల నుంచి నడిపిస్తుంది. ఉపాసన నడుపుతున్న ఈ మాగజైన్ కు సమంత ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడూ ఫిట్ గా ఉంటూ సమంత మిగతా నటీమణులకు ఆదర్శంగా ఉంటారు. దాంతో ఉపాసన సమంతను ఎంచుకుంది. ఇక యువర్ లైఫ్ ద్వారా తక్కాలి సదం, క్యారెట్ ఇడ్లీ బ్రేక్ ఫాస్ట్ ను సమంత తయారు చేసి  ఆ వంటకాలకు ప్రేక్షకుల ముందు ఉంచింది. ఇప్పుడు ఆ వంటకాలకు గానూ ఆమె ప్రశంసలు పొందుతోంది.

అయితే తాజాగా ఈ మ్యాగజైన్ కోసం చేసిన సమంత ఫోటో షూట్ ఇప్పటికే వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా సమంత ఫోటో షూట్ చేసిన సమయంలోని ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వీడియోలో సమంత హాట్ లుక్స్ తో జిమ్ లో పోసులు ఇస్తోంది. ఇక పక్కనే రాంచరణ్ సతీమణి ఉపాసన కూడా ఉన్నారు. ఈ వీడియోలో ఉపాసన ఇది మా మొదటి ఫోటో షూట్  అంటూ పేర్కొన్నారు.

More Related Stories