English   

మరో క్రేజీ ప్రాజెక్ట్ తో వస్తున్న సత్యదేవ్

Satyadev
2020-10-20 10:40:35

విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సత్యదేవ్. ఎన్నో ఏళ్లుగా సత్యదేవ్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ క్రేజీ డైరెక్టర్ పురిజగన్నాథ్ దర్శకత్వంలో "జ్యోతిలక్ష్మీ" సినిమాలో నటించి సత్యదేవ్ తన యాక్టింగ్ తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక లాక్ డౌన్ కాలం మిగతా నటులకు తీరని నష్టాన్ని తీసుకురాగా సత్యదేవ్ కు అదే ప్లస్ అయింది. లాక్ డౌన్ కాలం పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో ఆ టైం లో వచ్చిన సత్యదేవ్ సినిమాలకు మంచి మార్కులు పడ్డాయి. బ్లఫ్ మాస్టర్ సినిమాతో నటుడిగా సత్యదేవ్ మరో మెట్టు ఎక్కారు. 

ఇక ఇటీవల వచ్చిన "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య" సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సత్యదేవ్ కు మంచి గుర్తింపు లభించింది. ఇక ఇప్పుడు ఈ యంగ్ హీరో మరిన్ని క్రేజీ ప్రాజెక్టు లతో ముందుకు వస్తున్నారు. తాజాగా మరో క్రేజీ సినిమాకు సత్యదేవ్ క్లాప్ కొట్టాడు. ఈరోజు లాంఛనంగా ప్రారంభం అయిన "తిమ్మరుసు" అనే సినిమాలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలోను సత్యదేవ్ పాత్ర వినూత్నంగా ఉండనుందట. ఈ నెల 21 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ ను పూర్తి చేయాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

More Related Stories