English   

ఇటలీలో నరకం కనిపిస్తుంది.. పూజా హెగ్డే సంచలన కామెంట్స్..

 Pooja Hegde
2020-10-20 13:40:26

కరోనా వైరస్ కారణంగా దాదాపు ఆరు నెలల షూటింగ్ జరగలేదు. ఎన్నో వందల సినిమాలు అలాగే ఆగిపోయాయి. మళ్లీ ఇప్పుడిప్పుడే అందరూ కెమెరా ముందుకు వస్తున్నారు. అందులో ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ కూడా ఉంది. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్య మొదలైంది. గత పది రోజులుగా ఇటలీలో షూటింగ్ చేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని అక్కడ షూటింగ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ విషయంపై పూజాహెగ్డే మాత్రం ఇప్పుడు సంచలన కామెంట్స్ చేసింది. ప్రపంచంలో కరోనా వైరస్ అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇటలీ కూడా ఉంది. ఇప్పటికే కొన్ని లక్షల మంది అక్కడ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వేలాది మంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోయారు. ఒకానొక సమయంలో ఆస్పత్రి బెడ్స్ లేక ఆ దేశంలోని 70 ఏళ్లు దాటిన వృద్ధులను చికిత్స చేయలేక వదిలేశారు. వాళ్ళు అలాగే రోడ్ల పైనే చనిపోతున్నారు.

ఇలాంటి భయానక పరిస్థితులు ఇటలీలో కనిపించాయి. శవాలను కుప్పలుగా ఖననం చేసిన వీడియోలు చూశాం. ఇప్పుడిప్పుడే ఆ దేశం కరోనా నుంచి కోలుకుంటోంది. అయితే కేసులు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ రికార్డు స్థాయిలో నమోదవుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో రాధేశ్యామ్ షూటింగ్ అక్కడ జరుగుతుండటం అభిమానులను కలవరపెడుతోంది. ఇదే విషయంపై పూజ హెగ్డే మాట్లాడింది. ఎలాంటి పరిస్థితుల్లో ఇటలీలో తాము ఎలా షూట్ చేస్తున్నాము అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ మొదటి రెండు రోజులు షూటింగ్ చాలా భయానకంగా ఉందని.. ఆ కరోనా తీవ్రతకు చాలా భయపడ్డట్టు చెప్పుకొచ్చింది పూజా. అన్ని జాగ్రత్తలు పాటించిన తర్వాత షూటింగ్ చేస్తున్నామని తెలిపింది. యూనిట్ సభ్యులందరూ రోజూ కరోనా పరీక్షలు చేసుకుంటున్న పరిస్థితి ఉందని.. రోజంతా మస్కులు తప్పనిసరి అయిందని.. కేవలం కెమెరా ముందు వెళ్లేటప్పుడు మాత్రమే మస్కులు తీస్తున్నామని తెలిపింది. రాధా కృష్ణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న టీజర్ విడుదల కానుంది. 

More Related Stories