English   

హైదరాబాద్ వరద బాధితులకు టాలీవుడ్ విరాళం.. ఎవరెంత ఇచ్చారంటే..

ntr
2020-10-20 14:29:21

కష్టమొచ్చినపుడు కచ్చితంగా అండగా నిలబడాలి. లేదంటే రీల్ హీరోలు రియల్ హీరోలు ఎప్పుడు అవుతారు. అందుకే ఇప్పుడు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. హైదరాబాద్‌లో వరదలు రావడంతో వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. వాళ్లకు ఇప్పుడు సాయం చేయడానిక టాలీవుడ్ కదిలొచ్చింది. ఒక్కొక్కరుగా తమకు తోచిన విరాళం అందిస్తున్నారు. బాలయ్య అందరికంటే ముందే కోటిన్నర ఇస్తే ఇప్పుడు ఆయన్ని ఫాలో అవుతూ చాలా మంది విరాళం ప్రకటిస్తున్నారు. 

బాలయ్య కోటి 50 లక్షలు రూపాయలు
చిరంజీవి కోటి రూపాయలు
మహేష్ బాబు కోటి
ఎన్టీఆర్ 50 లక్షలు
విజయ్ దేవరకొండ 10 లక్షలు
త్రివిక్రమ్ 10 లక్షలు
హారిక హాసిని 10 లక్షలు
అనిల్ రావిపూడి 5 లక్షలు
హరీష్ శంకర్ 5 లక్షలు

More Related Stories