English   

కరోనా బారినపడ్డ టీవీ సెలబ్రెటీ

Sudigaali Sudheer
2020-10-21 08:13:35

రాష్ట్రంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా ను అదుపు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంలేదు. అయితే ఇదివరకు కరోనా వచ్చిన వారికి రిస్క్ తో పోల్చుకుంటే ఇప్పుడు రిస్క్ తగ్గినట్టు తెలుస్తోంది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా టీవీ సెలబ్రెటీ సుడిగాలి సుధీర్ కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 18న సుధీర్ కు కరోనా నిర్ధారణ అయినట్టు వార్తలు వస్తున్నాయి. కరోనా సోకడంతో సుదీర్ ప్రస్తుతం హోమ్ క్వారన్టైన్ లో చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా సుదీర్ జబర్దస్త్ షో తో పాపులర్ అయ్యారు. ఆ తరవాత టీవీ సెలెబ్రెటీగా మంచి గుర్తింపు తెచ్చున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో కూడా నటిస్తున్నారు. మరో వైపు పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొని తన కామెడీతో నవ్విస్తున్నారు. ఇక సుదీర్ ఇటీవల జరిగిన కొన్ని టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాంతో అతడిని కాంటాక్ట్ అయినవారు కూడా కరోనా బారిన పడే అవకాశం ఉందంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

More Related Stories