English   

నటుడు పృథ్వీరాజ్ కు రోడ్డు ప్రమాదం

Actor Prudhvi Raj
2020-10-21 08:49:33

టాలీవుడ్ నటుడు, మాజీ ఎస్వీబీసీ ఛైర్మెన్ పృథ్వీరాజ్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఆయన కారులో బంజారాహిల్స్ క్యాన్సర్ ఆస్పత్రి దగ్గర వినాయకుడి గుడివైపు వెళుతుండగా మరో కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ టీం అతడి సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. ప్రమాదంలో పృథ్వీరాజ్ కారు ధ్వంసం అయిందంటూ పేర్కొన్నారు. అయితే పృథ్వీరాజ్ కు ఏమైనా గాయాలయ్యాయా లేదా.? అన్న విషయాన్ని పేర్కొనలేదు. దాంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కరోనా బారిన పడిన పృథ్వీరాజ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. దాంతో కరోనా నెగిటివ్ వచ్చినట్టు ఆయన ఓ వీడియోలో పేర్కొన్నారు. గత కొంతకాలంగా పృథ్వీరాజ్ టైమ్ అస్సలు బాగోలేనట్టు కనిపిస్తోంది. ఎస్వీబీసీ చైర్మన్ గా ఎన్నికైన తరవాత లైంగిక ఆరోపణలు రావడంతో పృథ్వీరాజ్ ఆ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇక అది జరిగిన కొన్ని రోజులకే ఆయన కరోనా బారిన పడటం..మళ్ళీ ఇప్పుడు యాక్సిడెంట్ జరగటం చూస్తుంటే టైం బాగోలేదనే అనిపిస్తోంది.

More Related Stories