English   

ప్రభాస్ పుట్టినరోజున ఫ్యాన్స్ కు స్పెషల్ గిఫ్ట్ ఇదే

Prabhas
2020-10-21 09:12:01

రెబ‌ల్ స్టార్" ప్ర‌భాస్ హీరోగా గొపికృష్ణ మూవీస్‌, యూవి క్రియెష‌న్స్ సంయుక్తంగా డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం "రాధేశ్యామ్‌". బాహుబలి1, బాహుబ‌లి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న ప్ర‌భాస్ త‌న 20 వ చిత్రాన్ని రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని "రెబ‌ల్‌స్టార్" డాక్టర్ యూ.వి.  కృష్ణంరాజు గారు స‌మ‌ర్పించ‌గా, వంశీ, ప్ర‌మెద్‌, ప్రసీధ‌ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సూప‌ర్‌హిట్ సినిమాలు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యూవి క్రియెష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్ కి సంగీత‌ దర్శ‌కునిగా జస్టిన్  వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

ఇక ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కి విశేష స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో న‌వ‌రాత్రులు అలాగే అక్టోబ‌ర్ 23న‌ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా "బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్" పేరిట మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తున్నారు. రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం యూర‌ప్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది.  తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో రాధేశ్యామ్ ను విడుద‌ల చేయడానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

More Related Stories