English   

ప్రేమించిన వ్యక్తి కోసం కెరీర్ ను పక్కన పెట్టిన రాశి

Heroine Raasi
2020-10-21 12:23:57

సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకునేది ప్రముఖ నటులను..లేదంటే ప్రముఖ వ్యాపారవేత్తలను అది కూడా తమకు సినిమా కెరీర్ పూర్తయింది అనే టైంలో పెళ్లి చేసుకుంటారు.కానీ హీరోయిన్ రాశి మాత్రం మంచి ఫామ్ లో ఉన్నప్పుడు వివాహం చేసుకుంది. అయితే రాశి ఒక మాములు అసిస్టెంట్ డైరెక్టర్ ను వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. రాశి చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తరవాత తన తండ్రి కొరికమేరకు హీరోయిన్ అయింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో రాశి ఆఫర్లు దక్కించుకుని టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఈ క్రమంలో రాశి తండ్రి మరణించారు. దాంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురైంది.

ఆ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీముని ఆమెకు ధైర్యం చెప్పి ఓదార్చారు. దాంతో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. దాంతో రాశి తన మనసుకు నచ్చిన శ్రీముని ని వివాహం చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రాశిని పెళ్లి చేసుకుంటామని వచ్చారు కానీ వారందరికీ సున్నితంగా నో చెప్పి మనసుకు నచ్చినవాడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న సమయంలో రాశి ఇండస్ట్రీ లోనే ప్రముఖ హీరోయిన్ చేతి నిండా సినిమాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వాటన్నిటినీ పట్టించుకోకుండా శ్రీమ్యూనిని పెళ్లాడింది. ప్రస్తుతం వీళ్లకు ఒక పాప కూడా ఉంది. ఇక అప్పుడప్పుడు టీవీ షోలలో తళుక్కుమనమనిపిస్తూ రాశి ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక తాజాగా రాశి ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి వంటలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతోంది.

More Related Stories