పట్టపగలే నటుడి దారుణ హత్య

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే నటుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే...తులు నటుడు సురేంద్ర బాబు "చలి పొలిలు, సవర్ణ దీర్ఘ సంధి," సినిమాల్లో నటించారు. అయితే గతంలో సురేంద్రకు రౌడీ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయనపై పోలీసులు రౌడీ షీట్ కూడా తెరిచారు. అయితే కన్నడ , తులు చిత్రాల్లో నరేంద్రకు కొన్ని ఆర్థిక లావాదేవీల వల్ల వివాదాలు ఉన్నాయట. ఆ కారణం వల్లనే సురేంద్రను హత్య చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సురేంద్ర ఇటీవల బీజేపీ నాయకులను బెదిరించడం తో జైలుకు వెళ్లారట. బెయిల్ పై భయటకు వచ్చిన అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సురేంద్ర కర్ణాటకలోని బంట్వాల్లో ఉన్న బీసీ రోడ్డులో నివాసం ఉంటున్నారు. అతడు అపార్ట్మెంట్ లో ఉన్న సమయంలో కొందరు దుండగులు వచ్చి హత్య చేసినట్టు తెలుస్తోంది. పట్టపగలు ఈ మర్డర్ జరగటం కలకలం రేపుతోంది. సమాచారం అందడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఇప్పటివరకూ మర్డర్ ఎవరు చేసారన్నది ఇంకా తేలలేదు. సురేంద్ర మరణంతో ఆయన అభిమానులు ఒక్క సారి షాక్ కు గురయ్యారు.