English   

అందాల వడ్డనకు ఒకే..కానీ

Actress Payal Rajput
2020-10-22 17:39:54

కెరీర్ మొదట్లోనే "ఆర్ఎక్స్100" లాంటి బోల్డ్ అటెంప్ట్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. సినిమాలో ఫుల్ రొమాన్స్ చేసి కుర్రకారును ఆకట్టుకుంది. సినిమాలోని పాత్రకు పాయల్ సరైన న్యాయం చేసిందని రివ్యూస్ వచ్చాయి. ఆ తరవాత ఆర్డీఎక్స్ సినిమాలో నటించింది. ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోవడం పాయల్ కు మైనస్ పాయింట్ అయింది. ఇక ఇటీవల ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమాలో ఆఫర్ దక్కించుకుంది. ఆ సినిమా మినహా పాయల్ కు వేరే ఆఫర్ లు రాలేదు. అంతగా వయ్యారాలు వలకబోసినా పాయల్ కు అవకాశాలు దక్కకపోవడం గమనార్హం. మరోవైపు అగ్రహీరోలు బాలీవుడ్ భామలకు అవకాశాలు ఇస్తున్నారు కానీ పాయల్ పాపకు ఇవ్వడం లేదు. దాంతో లాక్ డౌన్ కాలంలో పాయల్ పిల్లో ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో కుర్రకారు మతిపోగొట్టింది. సోషల్ మీడియా ద్వారా తన ఫాలోయింగ్ ను పెంచుకోడానికి ప్రయత్నాలు చేసింది. అయినప్పటికి పాయల్ కు అవకాశాలు దక్కలేదు. పాయల్ కు వచ్చే అవకాశాలు అన్నీ బోల్డ్ పాత్రలే వస్తున్నాయట. అంతే కాకుండా ఈ అమ్మడు ఏ ఆఫర్ వచ్చినా 40 లక్షల కంటే తక్కువకు చేయడం లేదట.

More Related Stories