English   

పోర్న్ సైట్స్ లో నటి వీడియోలు..తొలగించాలంటూ రిక్వెస్ట్

 Sona M Abraham
2020-10-24 09:41:54

దేశంలో పోర్న్ సైట్స్ పై నిషేధం విధించినప్పటికి పూర్తిగా వాటిని కట్టడి చేయలేకపోయారు. దాంతో పోర్న్ భూతం దేశాన్ని పట్టి పీడిస్తోంది. సాధారణ మహిళలతో పాటు సెలబ్రెటీలకు సైతం ఈ సైట్స్ కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఎంతోమంది నటీమణులు పోర్న్ సైట్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నటీమణులు సినిమాల్లో నటించిన సన్నివేశాలను పోర్న్ సైట్స్ లో పెట్టడం, వారి ముఖాలను మార్ఫింగ్ చేసి పెట్టడం తో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. తాజాగా సోనా ఎం అబ్రహం అనే మలయాళ సినిమా నటి పోర్న్ సైట్స్ వల్ల తాను ఎదుర్కొంటున్న ఇబ్బందును చెబుతూ ఆవేదన వ్యక్తంచేసింది. తనకు 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు సోనా "ఫర్ సెల్" అనే చిత్రంలో నటించింది. 

అయితే ఆ సినిమాలో 150 మంది ఆమెపై అత్యాచారం చేసే ఒక సన్నివేశం ఉంది. ఆ సీన్ కు సోనా నో చెప్పినప్పటికీ డైరెక్టర్ బలవంతంగా ఒప్పించాడట. కాగా ఆ సీన్ చిత్రికరణ తరవాత కొంత భాగాన్ని మాత్రమే సినిమాలో పెట్టారట. కానీ షూటింగ్ జరుగుతున్న సమయంలో తీసిన అన్ని సీన్లను ఎవరో పోర్న్ సైట్స్ లో అప్లోడ్ చేసారట. ఇదివరకే వాటిపై ఫిర్యాదు చేసి సీన్లను తొలగించిందట. ఇక ఇప్పుడు మళ్లీ ఆ సీన్లు పోర్న్ సైట్స్ లో కనిపిస్తుడటంతో నటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు కేరళ ప్రభుత్వం, సైబర్ పోలీసులు సహాయం చేసి వీడియోలను ఎక్కడా లేకుండా చేయాలని వేసుకుంటూ కన్నీరు పెట్టుకుంది.

More Related Stories