మూడో కన్ను తెరుస్తున్న నయన్

లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస చిత్రాలు చేస్తూ ఇండస్ట్రీ లో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ బ్యూటీ మరో ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. "గృహం" ఫేమ్ మిళింద్ రావ్ దర్శకత్వంలో "నెట్రీకన్" అనే సినిమాలో నటిస్తోంది. నెట్రీకన్ అంటే మూడో కన్ను అని అర్థం. ఈ సినిమాలో నయన్ అందురాలిగా నటించనుంది. ఈ సినిమాను నయన్ బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసారు. కాగా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్ లో నయనతార తల నుండి రక్తం కారుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా నయనతార కెరీర్ లో 65వ సినిమాగా రాబోతుంది. సినిమా లో నయన్ అందురాలు అయినప్పటికీ ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనుంది. పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సమయంలోనే నయనతార తన కంటి చూపుని కోల్పోతుంది. అందురలిగా నయన్ ఒక మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించగలింగిందనేదే సినిమాలో ప్రధాన అంశం. ఈ సినిమా అంగవైకల్యం ఉన్నవారిలో ఆత్మవిస్వాసాన్ని పెంపొందించే విధంగా ఓ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ గా రాబోతుంది.