English   

సంక్రాంతి బరిలోకి ఆ హీరోలు కూడా

 Ravi teja
2020-10-26 12:19:42

కరోనా దెబ్బకు ఈ ఏడాది దసరా కు సినిమాలు ఏవీ థియేటర్లో విడుదల కాలేదు. కానీ సంక్రాంతికి బరిలోకి దిగడానికి మాత్రం చాలా సినిమాలు ఇప్పటికే రెడీ అయ్యాయి. ఇక ఇప్పుడు ఆ లిస్టులో మరో రెండు సినిమాలు కూడా చేరాయి. రామ్ పోతినేని హీరోగా నటించిన "రెడ్" మరియు రవితేజ హీరోగా వస్తున్న "క్రాక్" సినిమాలు కూడా సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే మొదట ఈ రెండు సినిమాలు కూడా ఓటీటీ లో విడుదల కానున్నాయని వార్తలు వచ్చాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాలను సంక్రాంతికి విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే పోస్టర్ లను కూడా విడుదల చేశారు. ఇక ఈ న్యూస్ తో అటు రామ్ ఫ్యాన్స్ ఇటు రవితేజ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరోవైపు సంక్రాంతికి విడుదల చేయడానికి రానా అరణ్య, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యచిలర్, నితిన్ రంగ్ దే, సినిమాలు ఉన్నాయి. అంతే కాకుండా భారీగా తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ కూడా ఉంది. ఇక తాజాగా క్రాక్, రెడ్ కూడా సంక్రాంతి కి రిలీజ్ అయ్యే లిస్ట్ లో చేరడంతో ఈ ఏడాది సంక్రాంతికి అరడజన్ సినిమాలు విడుదలకు సిద్ధంగానే ఉన్నాయి. ఇక అప్పటివరకు కరోనా ఆంక్షలు కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి థియేటర్లో పండగ వాతావరణం కనిపించనుంది.

More Related Stories