English   

దసరా పండగకి అత్తారింట్లో రానా సందడి

  Rana
2020-10-26 18:25:36

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి లాక్ డౌన్ వేళ ప్రముఖ వ్యాపారవేత్త కూతురు మిహికా బజాజ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రానా మిహికా ల ఎంగేజ్మెంట్ ఫోటోలు, పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. ఆగస్టు నెలలో రానా-మిహికా పెళ్లి పీటలు ఎక్కారు. అయితే కరోనా ఆంక్షలు ఉండటంతో అతి కొద్దిమంది సమక్షంలోనే వారి వివాహం జరిగింది. లాక్ డౌన్ కారణంగా రానా మిహికా లు హనీమూన్ కు వెళ్లిపోలేకపోయారు. అయితే ఇటీవల ఇద్దరూ హనీమూన్ కి వెళ్లారు. హనీమూన్ కు వెళ్ళినప్పుడు మిహికా పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. మిహికా తన ఫోటోలకు "ఇప్పుడే ఎందుకంటే" అని క్యాప్షన్ పెట్టింది. ఇదిలా ఉండగా రానా దసరా పండుగకు తన అత్తారింటికి వెళ్ళాడు. పెళ్ళైన మొదటి ఏడాది పండుగలకు అల్లుళ్లు అత్తారింటికి వెళ్లడం ఆచారం అలానే రానా కూడా అత్తారింటికి వెళ్ళాడు. ఈ సంధర్భంగా రానా మిహికతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫొటోలో మిహికా పర్పుల్ సారీలో ట్రెడిషనల్ జ్యులరీ ధరించి ఆకట్టుకుంటోంది. ఇక రానా తెల్ల కుర్తా మరియు జీన్స్ ధరించి కూల్ గా కనిపిస్తున్నాడు. కాగా రానా ప్రస్తుతం టాలివుడ్ తో పాటు బాలీవుడ్ లోను సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల రానా నటించిన హౌస్ ఫుల్-4 సినిమా సూపర్ హిట్ అయ్యింది. మరోవైపు తెలుగులో "అరణ్య, హిరణ్యకశ్యప" అనే సినిమాల్లో నటిస్తున్నాడు.

More Related Stories